తెలంగాణలో బోనస్ అనేది బోగస్..: నిరంజన్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వానికి హామీల అమలుపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన పథకాలు అమలు కాలేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
బోనస్ అనేది బోగస్ గా మారిందని పేర్కొన్నారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా ఎవరూ స్పందించడం లేదని తెలిపారు.
ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.