తాలిబాన్ చట్టాలు అంటూ వైసీపీ పై బోండా ఉమా సీరియస్ వ్యాఖ్యలు..!!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.కందుకూరు మరియు గుంటూరు సభలలో తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమని అన్నారు.

ఈ రెండు ఘటనాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని దాన్ని పక్కదారి మళ్ళించడానికి ప్రతిపక్షాలను ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు సభలకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.దీంతో జగన్ లో వణుకు మొదలైందని సెటైర్లు వేశారు.

ఈ రీతిగా జనాలు వస్తుంటే జగన్ మరియు వైసీపీ పని అయిపోయినట్టేనని చెప్పుకొచ్చారు.

టీడీపీ సభలకు ప్రజాస్పందన భారీగా రావడంతో తట్టుకోలేక.సభలు మరియు ర్యాలీలు పెట్టకుండా జీవో తీసుకొచ్చారని విమర్శించారు.

బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టి పోయిన జీవో తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చూస్తుంటే రాబోయే రోజుల్లో తాలిబాన్ చట్టాలు కూడా తీసుకొస్తారేమో అంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీవకుండా పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు.

టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయటం పట్ల బోండా ఉమా మండిపడ్డారు.

ముసలోడే కానీ మహానుభావుడు.. టిక్‌టాక్ లవర్ కోసం భార్యను వదిలేశాడు.. చివరకు?