ఓటమి పై హైకోర్టును ఆశ్రయించిన బోండా ఉమా

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనపై 25 ఓట్ల మెజారిటీ తో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందడం పై ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌ను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని, ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే వీవీ ప్యాట్స్ లెక్కింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కి అప్పుడే విన్నవించానని, ఈ క్రమంలో మే 23 న విష్ణు గెలుపు ను డిక్లేర్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలనీ పిటీషన్ లో పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని తాను గమనించానని, ఈ అంశాలన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

"""/"/ ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని ఈ సందర్భంగా ఉమా కోరారు.

అయితే ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18 కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోండా ఉమా పై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు విజయాన్ని సాధించారు.

అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్ల భారీ మెజారిటీ తో గెలిచి ఏపీ లో ప్రభుత్వాన్ని స్థాపించింది.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!