సిద్దార్థ్‌ టాలీవుడ్ ఆశలు గల్లంతు అయినట్లేనా?

బొమ్మరిల్లు సిద్దార్థ్ )(Siddharth ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకుంటారు.ఆయన తెలుగు హీరో కాకున్నా కూడా ఒకానొక సమయంలో ఇక్కడ వరుసగా ఆఫర్లు వచ్చాయి.

మంచి విజయాలు కూడా నమోదు అయ్యాయి.కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎంపిక చేసుకున్న సినిమా లు మరియు కథ లు నిరాశ పర్చాయి.

దాంతో టాలీవుడ్( Tollywood, లో ఆయన ఆశలు గల్లంతే అన్నట్లుగా మూడు నాలుగు సంవత్సరాల క్రితమే ప్రచారం జరిగింది.

"""/" / కానీ అనూహ్యంగా టక్కర్ సినిమా తో తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

కానీ పరిస్థితులు అనుకూలించలేదు.టాలీవుడ్‌ లో టక్కర్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అవ్వాలనుకున్న మనోడి ఆశ నెరవేరలేదు.

టక్కర్ సినిమా( Takkar ) డిజాస్టర్ గా నిలిచింది.కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా దక్కలేదు.

దాంతో టక్కర్ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది.సిద్దార్థ్ తో సినిమాలు చేయాలని అనే ఆలోచన పెట్టుకున్న వారు ఇక పై ఆ ఆలోచన రాకుండానే జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి.

సిద్దు తో సినిమా అంటే కచ్చితంగా రిస్కీ ఫ్యాక్టర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / సోషల్‌ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.సిద్దార్థ్ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి విలన్‌ గా చేసినా కూడా తెలుగు లో ఈయనకి ఆఫర్లు వస్తాయా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దార్థ్ తెలుగు లో మళ్లీ బిజీ అయ్యే అవకాశం కనిపించడం లేదని మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది.

తమిళంలో నటించిన సినిమా లు ఏమైనా తెలుగు లో డబ్ అయ్యి సక్సెస్ అవ్వాల్సిందే కానీ నేరుగా తెలుగు సినిమా లు మాత్రం ఆయన దక్కించుకునే అవకాశం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది.

2025 సంవత్సరంలో మనవడు కావాలని కోరిన సురేఖ.. చరణ్ శుభవార్త చెబుతారా?