ఒక్క రోడ్డు కూడా సక్కగ లేదు సారూ…!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్ళే రోడ్డు చూసినా గుంతలమయమై ప్రయాణం చేయాలంటే ప్రాణాల మీదకొస్తుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత పదేళ్ళుగా పాలకుల నిర్లక్ష్యంతో రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా తయారై కనీసం కాలినడకన వెళ్ళే వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

కాజీపేట నుండి ఎర్రకుంట చౌరస్తా వరకు, చీకటిమామిడి నుండి భువనగిరి వరకు, బొమ్మలరామరం నుండి హాజీపూర్ వరకు మరింత అధ్వాన్నంగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా అయిపోయిందని ఆరోపిస్తున్నారు.

ఈ రోడ్లపై ప్రయాణం చేయలేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని,ఇక వర్షా కాలంలో అయితే మండల ప్రజల బాధలు వర్ణనాతీతమని అంటున్నారు.

రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల కరణంగా అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని,అనేకమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రస్తుత పభుత్వం చొరవ తీసుకుని మండలంలోని అన్ని రోడ్లును పునరుద్ధించాలని కోరుతున్నారు.

యూఎస్ కంటే ఇండియా బెస్ట్.. ఢిల్లీలో జీవితం అద్భుతం.. అమెరికన్ కామెంట్స్ వైరల్..?