సోనూ సూద్, జీషన్ సిద్ధిఖీ చేసిన సేవల పై ఆందోళన వ్యక్తం చేస్తున్న కోర్టు.. !!
TeluguStop.com
మానవ సేవయే మాధవ సేవ అన్నారు.గంటల తరబడి పూజలు చేస్తే భగవంతుడు కరుణిస్తాడని అనుకుంటారు.
కానీ కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సహాయం చేసి, వారి కంట కన్నీరు రాకుండా చూసిన చాలు, ఆపదలో ఆదుకున్న చాలు ఆ భగవంతున్ని సేవించినట్లే.
అయితే నేటి కాలంలో ఇలా నిస్వార్ధంగా సేవచేసిన తప్పుపట్టే వారున్నారు.మనిషి ఆలోచలనలను బట్టి ఎదుటి వారు అర్ధం అవుతారని అంటారు.
అలాగే కరోనా సమయంలో నటుడు సోనూ సూద్ అనేక మందికి సహాయన్ని అందించారు.
అందులో కరోనాతో బాధపడుతున్న రోగులకు వారి బంధువులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి చేశారు.
అలాగే మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కూడా బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు సమకూర్చారు.
అయితే ఈ విషయంలో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది.కరోనా చికిత్సకు కీలకంగా మారిన ఈ టీకాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళాయంటు ప్రశ్నిస్తుంది.
కాగా ఈ అంశం పై మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వివరణ ఇచ్చింది.అయితే ఆ వివరణ పై అసంతృప్తిని వెల్లడిస్తూ వీళ్లిద్దరూ తమను తాము దైవదూతలుగా భావిస్తూ అవగహన లేకుండా వ్యవహరించారని కాబట్టి పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, వీళ్ల తరహాలోనే రేపు మరొకరు వస్తారు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది బాంబే హై కోర్టు.
అంటే ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం కూడా తప్పే అనేలా వ్యవహరిస్తున్న కోర్టు తీరు పై జనం అసంతృపిని వ్యక్తం చేస్తున్నారట.