కర్ణాటకలో బాంబు బెదిరింపుల కలకలం

కర్ణాటక రాష్ట్రంలో బాంబు బెదిరింపుల కలకలం చెలరేగింది.బెంగళూరులోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం.

స్కూళ్లలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ -మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.

స్కూళ్ల సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు.వెంటనే ఆయా స్కూళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి ఫేక్ బెదిరింపులని తేల్చారు.

ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

24 గంటల్లోగా నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.అయితే బాంబు బెదిరింపులు అల్లరి మూకల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాఠశాలలకు భద్రత పెంచాలని పోలీసులకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు.

విదేశాల్లో భారతీయ విద్యార్ధుల మరణాలు.. ఐదేళ్లలో అంతమందా..?