తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. !

కొందరు తెలిసి, తెలియక చేసే పనుల వల్ల ఎన్ని నష్టాలు, కష్టాలు వస్తాయో ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల విషయంలో అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో సెక్యూరిటీ చాలా అప్రమత్తంగా ఉంటుంది.

అయిన గానీ ఆకతాయిలు ఇలాంటి వారికి కాల్ చేసి బెదిరిస్తే వీరి అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నట్లే.

,/br.అయితే తప్పు చేసిన వ్యక్తికి సరైన సమయంలో ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం చేయకుండా చేయవలసిన బాధ్యత అధికారుల పై ఉంటుంది.

ఇకపోతే ఒక ఆకతాయి, అందులో మతిస్దిమితం లేని వ్యక్తి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి బాంబు పెట్టినట్లుగా కాల్ చేసి బెదిరింపుకు పాల్పడ్డాడట.

దీంతో అప్రమత్తం అయిన పోలీసులు, బాంబు స్క్వాడ్‌ నిపుణులు, పోలీసు జాగిలంతో సీఎం ఇంటికి క్షుణ్ణంగా తనిఖీలు చేయగా అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించక పోవడంతో ఇది ఉత్తుత్త కాల్ అని నిర్దారణకు వచ్చి ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించారట.

ఆ అగంతకుడు విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్‌ (26) గా గుర్తించారు.

అయితే ఇతనికి మతిస్దిమితం లేదని తెలుసుకున్న పోలీసులు అతని తల్లిదండ్రులను హెచ్చరించి పంపించారట.

కానీ ఇతను ఇలాగే గతంలో కూడా పలువురి ప్రముఖుల విషయంలో ప్రవర్తించడని పోలీసుల విచారణలో తేలిందట.

వైరల్ వీడియో: మంచు కొండల్లో హుక్ స్టెప్ తో రెచ్చిపోయిన సీనియర్ హీరోయిన్..