ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు

ఢిల్లీలోని ఓ స్కూల్ కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

మధుర రోడ్డులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఉదయం 8 గంటల సమయంలో ఈ-మెయిల్ వచ్చింది.

అందులో పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నారు దుండగులు.దీంతో అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు ముందుగా విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు.

అనంతరం బాంబు స్వ్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తరువాత పోలీసులు కేసు నమోదు చేసి ఈ-మెయిల్ చేసిన వారి కోసం గాలిస్తున్నారు.

భారతీయులకు షాక్ .. ఫారిన్ రిక్రూట్‌మెంట్‌పై కఠిన ఆంక్షల దిశగా యూకే సర్కార్