లాక్ డౌన్ వేళ రికార్డులు సృష్టించిన రామాయణ్

కరోనా ధాటికి దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది.ఇక ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కారణంగా కంపెనీలు కూడా మూతపడి మెజారిటీ ప్రజలు ఇంటిపట్టునే ఉంటున్నారు.

ఇక వీరందరూ సోషల్ మీడియాలో, టీవీల ముందు కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.అలాగే దొరికిన సమయాన్ని కుటుంబంతో స్పెండ్ చేస్తూ ఆశ్వాదిస్తున్నారు.

అక్కడకక్కడ బయటకి వచ్చేవారు ఉన్న పోలీసులు వారి స్టైల్ లో లాక్ డౌన్ ఉల్లంఘించేవారికి మర్యాదలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సమయంలో ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్స్ రామాయణ్ ని తిరిగి ప్రారంభించాలని చాలా మంది కోరారు.

దీంతో దూరదర్శన్ లో ఈ సీరియల్ తిరిగి ప్రసారం అయ్యింది.శని, ఆదివారాల్లో రామాయణం సీరియల్ ప్రసారమైంది.

రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ దారావాహికకు అద్భుతమైన స్పందన వచ్చింది.

శనివారం ప్రసారమైన ఈ ఎపిసోడ్స్ కు ఏకంగా 34 మిలియన్స్ వ్యూస్ వచ్చినట్టు బార్క్ లెక్కలు చెబుతున్నాయి.

ఇక ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్స్ ను ఏకంగా 51 మిలియన్స్ మంది చూశారు.

ఈ మధ్య కాలంలో ఓ సీరియల్ కు వచ్చిన వీక్షణల్లో ఇదే గొప్ప రికార్డ్.

దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సీరియల్ కు రాని వ్యూస్ రామాయణ్ సీరియల్ కి వచ్చాయి.

ఏకంగా రెండు ఎపిసోడ్స్ కు 85మిలియన్ వ్యూస్ దక్కడం గమనార్హం.దీనిని బట్టి ఆ సీరియల్ కి ఎంతటి ప్రజాదారణ ఉందో అర్ధమవుతుంది.

అలాగే జనాలు కూడా ఎంతగా టీవీలకి అతుక్కుపోయారు అనే విషయం కూడా అర్ధమవుతుంది.

కాళ్లు చేతులు నల్లగా మారాయా.. ఈ సింపుల్ రెమెడీతో తెల్లగా మెరిపించుకోండి!