కులమతాలకు అతీతంగా.. ప్రేమ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే?
TeluguStop.com
ప్రేమకు కుల మతాలు లేవు ప్రాంతం భేదం అసలే ఉండదు.ఎప్పుడు ఏ క్షణంలో రెండు మనసుల మధ్య ప్రేమ చిగురిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది.
అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లో చూడటమే కాదు నిజజీవితంలో కూడా ప్రేమకు మతం లేదు అని ఎంతోమంది హీరో హీరోయిన్లు నిరూపించారు.
మతాలకు అతీతంగా పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.అలాంటి బాలీవుడ్ జంటల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న జంట షారుక్ ఖాన్- గౌరీఖాన్ జంట.
హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతి గౌరీ ముస్లిం అబ్బాయి షారుక్ తొలి చూపులోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది.
తల్లిదండ్రులను ఒప్పించి మరీ 1991లో పెళ్లితో ఒక్కటయ్యారు ఈ జంట.అయితే ఎన్నో సవాళ్లను దాటుకుని తమ ప్రేమ విజయం సాధించింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు షారుక్ ఖాన్.
"""/" /
కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ ప్రేమ పెళ్లి కూడా ఇలాంటి ఒక ఆదర్శ వివాహం అని చెప్పాలి.
కరీనా కపూర్ పంజాబీ సైఫ్ అలీ ఖాన్ పటౌడి నవాబ్ వీరిద్దరూ ముందు స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ప్రేమికులుగా మారారు.
2012లో వివాహ బంధంతో ఒకటయ్యారు.వీరి బంధానికి గుర్తుగా ప్రస్తుతం తైమూరు అలీఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు.
వీరిది రెండో వివాహం కావడం గమనార్హం. """/" /
క్యూట్ బ్యూటీ ఇలియానా పెళ్లి కూడా ఇదే కోవలోకి వస్తుంది.
హిందూ అయినా రితేష్ దేశ్ ముఖ్ క్రిస్టియన్ అయిన జెనీలియా దశాబ్దకాలంపాటు ప్రేమలో మునిగి తేలి 2012లో పెళ్లితో ఒక్కటయ్యారు.
ఇక వీరి పెళ్లి హిందూ మరాఠీ వివాహ సంప్రదాయం ప్రకారం జరిగింది.సోహ అలీ ఖాన్ - కునాల్ కేమ్మ లది కూడా హిందూ ముస్లిం వివాహం కావడం గమనార్హం.
2009 లో ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడింది.ఒక సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు.
తర్వాత ఎన్నో రోజుల పాటు డేటింగ్ లో ఉన్నారు.ఇక వీరి పెళ్లి ఎంతో నిరాడంబరంగా కొంతమంది స్నేహితుల మధ్య 2016 లో హిందూ ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగింది.
వీరితో పాటు ప్రీతిజింటా అమెరికన్ బిజినెస్ మాన్ జీన్ గూడెనఫ్ కులమతాలకు అతీతంగా 2016 లో వివాహం చేసుకున్నారు.
అంతేకాకుండా ఇర్ఫాన్- సుతాప శిక్తర్ మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు.నసీరుద్దీన్ షా- రత్న పాఠక్ కూడా మతాంతర వివాహం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే.
1982లో వీరి పెళ్లి జరిగింది.ఫర్హాన్ అక్తర్ - శిబాని దండేకర్ కూడా మతాంతర వివాహం చేసుకున్నారు.
ఒక ఇలా బాలీవుడ్ లో ఎంత మంది సెలబ్రిటీలు కులాలకు మతాలకు అతీతంగా ప్రేమను గెలిపించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?