సెలబ్రెటీలు అయితే ఏంటి? బాధ్యత ఉండక్కర్లేదా..?
TeluguStop.com
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా మారిందో అందరికీ అర్థమవుతుంది.
రోజుకు కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మరణ సంఖ్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్న దేశం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది.
ఇదిలా ఉంటే తేడా లేకుండా ఈ వైరస్ సోకుతున్న సంగతి తెలిసిందే.కానీ సెలబ్రెటీలు మాత్రం బాధ్యత లేకుండా ఉంటున్నారు.
ప్రస్తుత ఈ వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగులు ఆగిపోగా.నటీనటులు ఇంట్లో ఉండకుండా హాలిడే ట్రిప్ అంటూ చెక్కేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ లో చాలామందికి కరోనా వైరస్ సోకగా.కొందరు చికిత్స పొందుతున్నారు.
మరికొందరు వైరస్ నుండి బయటపడగా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పటికే పలువురు బాలీవుడ్ బ్యూటీస్ మాల్దీవులకు వెళ్లగా.
ఈ సమయంలో ఈ ట్రిప్స్ అవసరమా అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా మరో పక్కన సెలబ్రిటీలు కూడా వీరిపై ఘాటుగా మండిపడుతున్నారు.
కొన్ని వ్యాఖ్యలు చేయగా.' మీ సరదాలు, విలాసాలను ఫోటో లను చిత్రీకరించి అభిమానులతో పంచుకోవాలని సరైన సమయం కాదని, బాధ్యతగా ఉండాలంటూ, కుదిరితే సహాయం చేయండి అంటూ' తెలిపింది.
అంతేకాకుండా శృతి హాసన్ కూడా స్పందించగా.మన ప్రివిలేజ్ లైఫ్ ను ఇలాంటి సమయంలో జనాలకు చూపించడం సరైన సమయం కాదని, ఇది బాధ్యతతో కూడిన పని అని, ప్రతి ఒక్కరికి కష్ట కాలమైనా ఈ సమయంలో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని తెలిపింది.
ఇక సెలబ్రిటీలు అయితే ఈ సమయంలో కాస్తయినా బాధ్యతగా ఉండకూడదా అని నెటిజనులు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే దిశాపటాని, జాన్వీ కపూర్, దియా మీర్జా, మాధురి దీక్షిత్, శ్రద్ధా కపూర్ ఇంకా పలువురు నటులు మాల్దీవులకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..