అయోధ్య చేరుకున్న అగ్ర సినీ తారలు వీళ్లే.. వైరల్ అవుతున్న ఫోటోలు!

గత 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క భారతీయుడి కలగా నిలిచినటువంటి అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir)నేడు ఎంతో ఘనంగా ప్రారంభం అయింది.

నేడు మధ్యాహ్నం శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించడం కోసం రామ భూమి ట్రస్ట్ వారు ఎంతో మంది సిని సెలబ్రిటీలను ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు అయోధ్య చేరుకొని సందడి చేశారు. """/" / టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు సెలబ్రిటీలకు కూడా అయోధ్య ఆహ్వానం అందిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) దంపతులతో పాటు రామ్ చరణ్ (Ram Charan) కూడా అయోధ్యకు చేరుకున్నారు.

ఈ వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు చిరంజీవి కుటుంబంతో పాటు ప్రభాస్ పవన్ కళ్యాణ్ సుమన్ వంటి తదితరులు కూడా అయోధ్యకు చేరుకున్నారు.

వీటితో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ( Bollywood Celebrities) కూడా అయోధ్యకు వచ్చిన సంగతి తెలిసిందే.

"""/" / బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయోధ్యకి వచ్చినటువంటి సెలబ్రిటీల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్,( Amitabh Bachchan ) అభిషేక్ బచ్చన్,( Abhishek Bachchan ) మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, రాజ్ కుమార్ హిరానీ మహావీర్ జైన్, రోహిత్ శెట్టి వంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ అద్భుతమైనటువంటి ఘటాన్ని చూడటం కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వేయికళ్లతో ఎదురు చూశారు.

కొన్ని శతాబ్దాల భారతీయుల కల నేడు నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణం మారుమోగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. జక్కన్న కామెంట్స్ వైరల్!