హీరోయిన్స్‌ మాత్రమే డ్రగ్స్‌ తీసుకుంటారా, హీరోలకు అలవాటు లేదా

డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి.కానీ వారందరూ కూడా హీరోయిన్స్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

సుశాంత్‌ మృతి కేసు విచారిస్తున్న సమయంలో రియా చక్రవర్తి కి డ్రగ్స్‌ డీలర్లతో సంబంధం ఉన్నట్లుగా అనుమానం రావడంతో అక్కడ మొదలైన ఎంక్వైరీ మెల్లగా బాలీవుడ్ ప్రముఖుల పై దృష్టి వెళ్లేలా చేసింది.

రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడును అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు సారా అలీ ఖాన్ శ్రద్ధా కపూర్ లకు కూడా విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం జరిగింది.

ఇంకా కూడా కొంత మంది హీరోయిన్స్‌ పేర్లు ప్రచారం జరుగుతున్నాయి.అవి కూడా హీరోయిన్స్‌ పేర్లే అవ్వడం పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి.

ఈ విషయంలో ఇప్పటి వరకు ఎన్‌ సీ బీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

ఇప్పటివరకు హీరోయిన్స్ పేర్లు మాత్రమే బయటకు రావడంతో బాలీవుడ్ హీరోలు ఇతర భాషల హీరోలకు డ్రగ్స్‌ అలవాటు లేదా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అసలు హీరోలు దర్శకులు డ్రగ్స్‌ తీసుకోరా లేదా వారిని కాపాడేందుకు ఏమైనా ప్రయ్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఎన్‌సీబీ అధికారులకు హీరోల ను ప్రశ్నించే అవకాశం రావట్లేదా లేదంటే వారి పేర్లు నిజంగానే బయటకు రావడం లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు హీరోల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలు ఆడుకుంటున్నారు.

పెద్ద పెద్ద హీరోలు మరియు దర్శకులు కూడా ఈ కేసుతో సంబంధం ఉండి ఉంటారని, ఖచ్చితంగా వారిని కూడా ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది..: జగ్గారెడ్డి