మూడో పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఏం జరిగిందంటే? 

ప్రస్తుత కాలంలో రెండు పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతున్నాయి.కొన్ని కారణాల వల్ల చాలామంది మొదటి పెళ్లికి స్వస్తి పలుకుతూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు.

కొన్ని కారణాల వల్ల వారి జీవిత భాగస్వామి మరణించిన లేదంటే వారి మధ్య గొడవలు వచ్చిన విడాకులు తీసుకొని విడిపోయి రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఒకప్పుడు ఈ పద్ధతి ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఇది కామన్ అయింది.

అయితే సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటుడు అమీర్ ఖాన్ ( Amir Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

"""/" / బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు.

అయితే తాజాగా మూడో పెళ్లి( Third Marriage ) గురించి అమీర్ ఖాన్ పరోక్షంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల అమీర్ ఖాన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో( The Great Indian Kapil Show ) కి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అమీర్ ఖాన్ తన సినిమాల గురించి ప్రశ్నించారు అయితే ఇంతలోనే అర్చన పూరన్ సింగ్ మూడో పెళ్లి గురించి పరోక్షంగా ప్రశ్నించారు.

"""/" / లైఫ్ లో సెటిల్ అవుదామని అనుకోలేదా అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రశ్నించడంతో అమీర్ ఖాన్ పెద్దగా నవ్వేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ప్రోమో వైరల్ అయింది.అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రీనా దత్త ( Reena Dattha ) అనే మహిళను 1986లో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం.ఈమెతో రెండవ సంవత్సరంలో విడిపోయిన అమీర్ ఖాన్ అనంతరం కిరణ్ రావు ( Kiran Rao ) అనే మహిళను 2005వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించారు.అనంతరం వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ ఒక్క నమ్మకంతోనే ఉన్నాము.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అలేఖ్య రెడ్డి?