బాలీవుడ్ లో జోరుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీస్..
TeluguStop.com
బాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువ ఉండేవి.కానీ రానురాను జనాల్లో మల్టీస్టారర్ సినిమాల పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది.
ఈ నేపథ్యంలో పలువురు ఫిల్మ్ మేకర్స్ సైతం మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
సినిమా తొలి నుంచి చివరి వరకు విలన్లుగా, కోస్టార్లుగా సందడి చేయబోతున్నారు.ఒకటి రెండు కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ మూవీస్ జనాల ముందుకు వస్తున్నాయి.
ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.*అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్
వీరిద్దరు కలిసి నటించిన క్రేజీ మూవీ టైటిల్ బడే మియా, ఛోటే మియాతో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ బాగా వైరల్ అవుతోంది.2023 క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
* హృతిక్ రోషన్- సైఫ్ అలీఖాన్
వీరిద్దరు హీరోలుగా తమిళంలో మంచి విజయం సాధించిన విక్రమ్ వేద మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
*షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ """/"/
బాలీవుడ్ క్రేజీ హీరోలు సల్మాన్, షారుఖ్ కలిసి నటిస్తున్న సినిమా పఠాన్.
ఇందులో సల్మాన్ ఖాన్ క్యామియో పాత్ర చేస్తున్నాడు.ఇంకో స్టార్ హీరో జాన్ అబ్రహం విలన్ రోల్ పోషిస్తున్నాడు.
*సల్మాన్, ఇమ్రాన్ హష్మి """/"/
టైగర్ సినిమాకు మూడో సీక్వెల్ గా వస్తున్న టైగర్-3లో సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మి కలిసి నటిస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ తో ఇమ్రాన్ ఫైట్ చేస్తాడట.ఇందులో షారుఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*సంజయ్ దత్- రణబీర్ కపూర్ """/"/
వీరిద్దరు కలిసి షంషేరా సినిమా చేస్తున్నారు.రణబీర్ కపూర్ హీరోగా చేస్తుండగా.
సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.సంజయ్ అక్షయ్ సినిమా పృధ్విరాజ్ లో కూడా మంచి పాత్ర చేస్తున్నాడు.
*అమీర్ ఖాన్- నాగచైతన్య """/"/
అమీర్ కీ రోల్ ప్లే చేస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా.
ఇందులో నాగచైతన్య నటిస్తున్నాడు.*అర్జున్ కపూర్, జాన్ అబ్రహం """/"/
వీరిద్దరు కలిసి ఏక్ విలన్ సినిమా థీమ్ తో వస్తున్న ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో నటిస్తున్నారు.
రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.* అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ """/"/
ఈ స్టార్లు ఇద్దరు కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమా చేస్తున్నారు.
ఇందులో నాగార్జున కూడా నటిస్తున్నాడు.మైధలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!