బాలీవుడ్‌ మీడియా కడుపు మంట, సిగ్గు చేటు కథనాలు

బాలీవుడ్‌ మీడియా( Bollywood ) గత రెండు రోజులుగా తెలుగు సినిమా లపై తెలుగు సినిమాల హీరోలపై అక్కస్సు వెళ్లగక్కుతోంది.

ఈసారి జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ ప్రభంజనం కనిపిస్తోంది.పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కొండపొలం, ఉప్పెన ఇలా ఎన్నో సినిమాలు అవార్డుల జాబితాలో నిలవడంతో పాటు చాలా కేటగిరీల్లో సినిమా లు అవార్డును సొంతం చేసుకున్న నేపథ్యం లో తెగ హడావుడి కనిపిస్తోంది.

పుష్ప సినిమా కు గాను అల్లు అర్జున్‌ ఉత్తమ జాతీయ నటుడు అవార్డును సొంతం చేసుకోవడం చాలా మందికి షాకింగ్ గా ఉంది.

"""/" / అవార్డులు టాలీవుడ్ కు వెళ్లడంను బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.

హిందీ సినీ వర్గాల వారు కొందరు పైకి తెలుగు సినిమాలకు మరియు టెక్నీషియన్స్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏంటి అంటే బాలీవుడ్‌ వారు ప్రస్తుతం టాలీవుడ్‌( Tollywood ) పై చాలా అక్కస్సు తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమా లు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి.

సరే వసూళ్లే కదా అని వదిలేస్తే ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డులను సైతం ఎగరేసుకు పోతున్నాయి.

ఇలాగే జరిగితే ముందు ముందు బాలీవుడ్‌ మనుగడ ఏమవుతుంది అంటూ కొందరు జాతీయ స్థాయి మీడియా సంస్థల ప్రతినిధులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

"""/" / తెలుగు సినిమా పరిశ్రమ గురించి కొందరు సిగ్గు చేటు కథనాలు రాస్తున్నారు.

అందులో ముఖ్యంగా జాతీయ అవార్డును దక్కించుకోవడంకు కారణం కచ్చితంగా రాజకీయ కారణాలు అంటూ కొందరు ఆరోపిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టఫ్ లేకున్నా కూడా పుష్ప వంటి సినిమాలకు అవార్డులను ఇచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే తమిళ చిత్రం జై భీమ్‌( Jai Bhim ) ను ఎందుకు జాతీయ అవార్డుల జ్యూరీ వదిలేసింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై హిందీ మీడియా కడుపు మంట కనిపిస్తోంది.

కూతురి పెళ్లిరోజు ఈ తండ్రి ఎంత సాహసం చేశాడో తెలిస్తే..