యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటిస్తున్న దేవర మూవీ( Devara ) ఏప్రిల్ 5వ తేదీన రావడం అసాధ్యమని తేలిపోయింది.

సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితులలో ఉండటం, విజువల్ ఎఫెక్స్ట్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది.

ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్టు త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఏపీలో ఎన్నికల వల్ల( AP Elections ) కూడా ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం కానుందని ప్రచారం జరుగుతోంది.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ క్రిటిక్స్ మాత్రం బాలీవుడ్ లో( Bollywood ) ఏప్రిల్ 10వ తేదీన పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దేవర వాయిదా పడిందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే సౌత్ సినిమాలపై బాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ విషం కక్కడం కొత్తేం కాదు.

సలార్,( Salaar ) డంకీ( Dunki ) రిలీజైన సమయంలో సలార్ గురించి బాలీవుడ్ మీడియాలో నెగిటివ్ కథనాలు వచ్చాయి.

"""/" / దేవర సినిమాకు హిందీ మార్కెట్ ముఖ్యమే కానీ హిందీ కంటే తెలుగు మార్కెట్ ముఖ్యం కావడం గమనార్హం.

దేవర మూవీ థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రిలీజ్ డేట్ మారడం వల్ల ఈ సినిమాపై వడ్డీల భారం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్( Netflix ) భారీ రేంజ్ లో ఖర్చు చేసింది.

"""/" / నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే దేవర సేఫ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ఆడియో రైట్స్ ఏకంగా 33 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆడియో రైట్స్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పాలి.

బాలీవుడ్ మీడియా సౌత్ సినిమాలను అనవసరంగా, అన్యాయంగా టార్గెట్ చేస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు