టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామలు!
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు ఓ రేంజ్ కనిపిస్తుంది.అంతేకాకుండా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన కథలు తెలుగులో రాగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా కథలకే ఆసక్తి చూపుతున్నారు.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక స్టార్ హీరో తెలుగు ముద్దుగుమ్మలను కాకుండా బాలీవుడ్గ్లామర్ బ్యూటీ లను ఎంపిక చేసుకుంటున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం మరికొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇందులో హీరోయిన్ లను రాజమౌళి ఏకంగా బాలీవుడ్, ఐరిష్ హీరోయిన్స్ నే ఎంపిక చేశారు.
రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఐరిష్ నటి ఒలీవియా మోరిస్ లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. """/"/
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే నటించనుంది.అంతే కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్ ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తుంది.
ఇక ప్రస్తుతం రానా అరణ్య సినిమా లో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి శ్రియ పిల్గొన్కర్ నటిస్తుంది.
ఇక ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.ఇదిలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ నటిస్తుంది.
పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?