ఆ స్టార్ హీరోయిన్ కు రామ్ చరణ్ తెలుగు నేర్పించాడా.. ఏం జరిగిందంటే?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్,కియారా అద్వానీ(Ram Charan, Kiara Advani) కలిసి నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్(Game Changer).

ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న అనగా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు మూవీ మేకర్స్.

ఇకపోతే రామ్ చరణ్ కీయరా అద్వానీల విషయానికి వస్తే ఇది వీరిద్దరూ ఇప్పటికే వినయ రామ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి సందడి చేయబోతున్నారు.ఇలా రెండు సినిమాలలో రామ్ చరణ్ తో కలిసిన నటించడంతో చెర్రీకి కియారా మంచి స్నేహితురాలుగా మారిపోయింది.

"""/" / ఇద్దరు కలిసి గేమ్ చేంజ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే బాలీవుడ్ లో షోలు సైతం చుట్టేస్తున్నారు.అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss)షో కి హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా కియారా ఆ షోలో తెలుగు మాట్లాడి సంచ‌ల‌నమైంది.నేను మిమ్మ‌ల్ని క‌లిసాక చాలా మంచిగా అనిపించింది అంటూ స‌ల్మాన్ ఖాన్ ని చూసి కియారా (Kiara)చెబుతుంది.

వెంట‌నే స‌ల్మాన్ వారెవ్వా అంటాడు.ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ (Charan )ప‌క్క‌నే ఉన్నాడు.

అత‌డు నాట్ బ్యాడ్ అంటాడు.స‌ల్మాన్ వెంట‌నే చ‌రణ్ వైపు చూస్తాడు.

మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి(Former Black Congress President) మానవత్వం. """/" / ఏం చ‌ర‌ణ్ ఈ తెలుగు నువ్వు నేర్పించావా? అన్న‌ట్లో ఒక ఎక్స్ ప్రెష‌న్ ఇస్తాడు.

చ‌ర‌ణ్(Charan) కూడా ఊ కొడ‌తాడు.ఇంత వ‌ర‌కూ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) ఏ హీరోయిన్ కు ఇలా తెలుగు నేర్పించ‌లేదు.

తొలిసారి ఆ ఛాన్స్ కియారా కొట్టేసింది.ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ కావడంతో చెర్రీ అభిమానులు అలాగే కియారా అద్వానీ(Kiara Advani) అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కియారా అద్వానీ తెలుగులో మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొన్నటికి మొన్న కియారా అద్వానీ అలాగే రామ్ చరణ్ కలసి ఒక షోలో పాల్గొనగా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుండడంతో రామ్ చరణ్ ఫుల్గా ఆట పట్టించిన విషయం తెలిసిందే.

ఉచిత కుట్టుమిషన్ మిస్ అయ్యారని ఫీల్ అవ్వొద్దు… ఇలా దరఖాస్తు చేసుకోండి!