ప్రభాస్ కల్కి సినిమాలో గెస్ట్ అపిరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరో…
TeluguStop.com
ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ( Prabhas ) ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమాతో ప్లాప్ వచ్చినప్పటికి వర్షం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూడకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.ఇక వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరో గా ఎదిగాడు.
ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటిన ప్రభాస్ ప్రస్తుతం వరుస గా మంచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
ఎందుకంటే పాన్ ఇండియాలో ఇప్పటివరకు దాదాపు 5 సినిమాలతో 300 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేసిన ఏకైక హీరోగా కూడా తను నిలవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక ఇప్పుడు కల్కి,( Kalki ) రాజసాబ్( Rajasaab ) లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.
ఇక ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు.
ఇక మొత్తానికైతే తను ఒక రెండు సంవత్సరాలు వరకు ఖాళీగా లేకుండా వరుస సినిమాలు పెట్టుకోనున్నాడు.
"""/" /
అయితే ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని తెలుస్తుంది.
ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఒక గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందట.అది సినిమాకి చాలా ముఖ్యమైనప్పటికీ సినిమాలో ఐదు నిమిషాల పాటు నిడివి తో సాగే పాత్ర కావడం వల్ల దానికి బాలీవుడ్ స్టార్ హీరో అయితే బాగుంటుందనే ఉద్దేశ్యం తో ఆ పాత్ర కోసం రణ్వీర్ సింగ్ ను( Ranveer Singh ) తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
అతనికి సంబంధించిన టీజర్ ని కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?