రవితేజ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇలాంటి క్రమంలోనే రవితేజ( Raviteja ) కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి.

అయితే గోపీచంద్ మలినేని తో రవితేజ సినిమా ఆగిపోయిన తర్వాత ఆయన ఖాళీగా ఉండకుండా హరిష్ శంకర్ తో( Harish Shankar ) ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో తను ఏంటో చూపెట్టడానికి మన ముందుకు రాబోతున్నాడు.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ ఇప్పటికే అభిమానులు ఈ సినిమా మీద మంచి అంచనాలను పెట్టుకున్నారు.

ఇక హరీష్ శంకర్ అంటే మాస్ కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఈ సినిమాలో రవితేజని మనం మళ్లీ ఫుల్ స్వింగ్ లో ఉన్న పాత్ర లో చూడవచ్చు అంటూ చాలామంది వాళ్ళ కామెంట్లని తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అనేది అటు రవితేజకు, ఇటు హరీష్ శంకర్ కి ఇద్దరికీ చాలా కీలకంగా మారబోతుంది అయితే ఈ సినిమా బాలీవుడ్ సినిమాకి రీమేక్ గా( Bollywood Remake ) వస్తున్నప్పటికీ ఈ స్క్రిప్ట్ లో మాత్రం చాలా వరకు చేంజేస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ప్రకారం ఈ సినిమాలో అజయ్ దేవగన్( Ajay Devgan ) ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.

"""/" / మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

అందుకే ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను చిత్ర యూనిట్ గోప్యం గా ఉంచినప్పటికీ అవి మాత్రం ఎలా లీక్ అవుతున్నాయో ఎవరికి అర్థంకావడం లేదు అంటూ సినిమా యూనిట్ చెప్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇక తొందరలోనే అజయ్ దేవగన్ తమ సినిమాలో భాగం కాబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించనున్నట్టు గా తెలుస్తుంది.

పుష్ప 2 బాహుబలి దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఇంకా ఎంత కలెక్షన్స్ ను రాబట్టాలి…