హైదరాబాద్ చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా.. ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల చిన్నది దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమివ్వడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే దీపిక ఈ పయనం ఎక్కడికో అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దీపికా పదుకొనే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.దీపికా పదుకొనే ఉన్నఫలంగా హైదరాబాద్ చేరుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

దీపికా పదుకొనే ప్రభాస్ కాంబినేషన్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే షూటింగ్ ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ క్రమంలో ఈమె సినిమా షూటింగులో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇందులో అమితా బచ్చన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

"""/" / హైదరాబాదులో ఈ సినిమా డిసెంబర్ 5నుంచి ప్రారంభం కావడంతో దీపిక ముందుగానే  హైదరాబాదు చేరుకున్నారు.

డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు.

ఇలా ముంబై నుంచి ఈ సినిమా కోసం హైదరాబాద్ బయలుదేరుతున్న సమయంలో దీపిక ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ఈమె నటించిన 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్