సూపర్‌ హ్యాట్రిక్ మిస్ చేసుకున్న బాద్‌ షా

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ( Shah Rukh Khan )అరుదైన రికార్డును, అరుదైన హ్యాట్రిక్ ను చేజార్చుకున్నాడు.

కచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుంది అనుకున్న డంకీ సినిమా( Dunki ) బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

ఇప్పుడు ఆ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించడం గొప్ప విషయంగా మారింది.

సలార్‌ కు పోటీగా రావడం తో పాటు టాక్ కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అన్నట్లుగా రాలేదు.

అందుకే డంకీ సినిమా కు జనాలు మొహం చాటేస్తున్నారు.అందుకే వెయ్యి కోట్ల వసూళ్లు రావడం లేదు.

"""/" /</di షారుఖ్‌ ఈ ఏడాది ఆరంభం లో పఠాన్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ ను టచ్‌ చేశాడు.

ఇక మొన్న దసరా కానుకగా వచ్చి జవాన్‌( Jawan ) తో వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు దక్కించుకున్నాడు.

దాంతో ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమా లు విడుదల చేసిన ఘనత దక్కాలి అనే ఉద్దేశ్యంతో షారుఖ్ ఖాన్‌ పట్టుబట్టి మరీ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయడం జరిగింది.

సలార్‌ వంటి పెద్ద సినిమా ఉన్నా కూడా తమ దర్శకుడు రాజ్ కుమార్‌ హిరానీ ( Rajkumar Hirani )పై ఉన్న నమ్మకం మరియు ఇతర విషయాలను బేరీజు వేసుకుని సినిమాను పూర్తి చేయడం జరిగింది.

"""/" / అదే జోష్ తో సినిమా ను 2023 లోనే విడుదల చేశారు.

షారుఖ్ ఖాన్‌ చాలా ఏళ్ల తర్వాత సూపర్‌ హిట్ అందుకోవడం తో అభిమానులు ఆనందంగా ఉన్నారు.

అలాంటి సమయంలో బ్యాక్ టు బ్యాక్‌ సినిమా లు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు సాదిస్తే మూడో సినిమా వెయ్యి కోట్ల పై ఆశలు పెట్టుకోకుండా ఉంటారా.

అందుకే డంకీ సినిమా పై కూడా అంచనాలు భారీగా పెట్టుకుని వెయిట్‌ చేశారు.

కానీ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు.

రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!