100 కోట్లు పెట్టి రెండు డూప్లెక్స్ హౌసులు కొన్న బాలీవుడ్ నటి?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆస్తులను సంపాదిస్తుంటారు అనే సంగతి మనకు తెలిసిందే.
ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సంపాదించినది మొత్తం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టు వ్యాపారాలను చేయడమే కాకుండా మరికొందరు ఆస్తులను పోగు చేసుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన బోనీకపూర్, తన కూతుర్లు జాన్వీ కపూర్ గురించి మనకు తెలిసిందే.
బోనీ కపూర్ నిర్మాతగా కొనసాగగా ఆయన కుమార్తె నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ విధంగా ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా లాభాలను అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
నిర్మాతగా ఈయన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించగా జాన్వీ కపూర్ సైతం ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఏడాదికి సుమారు అరడజనుపైగా సినిమాలలో నటిస్తున్నారు.
అదేవిధంగా ఈమె ఎన్నో బ్రాండ్లకు ప్రమోటరుగా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. """/"/
ఇలా ఈమె సంపాదించిన దానితో ఆరు నెలల క్రితం 40 కోట్ల రూపాయల విలువచేసే ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ విషయం మర్చిపోకముందే తన తండ్రి తన సోదరి కుషి కపూర్ తో కలిసి మరో 65 కోట్ల రూపాయల విలువ చేసే డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.65 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసారని సమాచారం.
6421 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఈ అపార్ట్మెంట్ ను బోనికపూర్ తన కూతుర్లతో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ లావాదేవీపై వారు రూ.
3.90 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
12 అక్టోబర్ 2022న రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందనీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త చెక్కర్లు కొడుతుంది.
భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!