బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి పనికిమాలిన వాళ్లే ఉన్నారు.. నోరా ఫతేహి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ( Bollywood Actress Nora Fatehi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహీ.
ఇకపోతే ఈమె ఇటీవల మడ్గావ్ చిత్రం( Madgaon Express )తో ప్రేక్షకులను ఆలోచించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఆస్వాదిస్తోంది బాలీవుడ్ భామ.డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన నోరా రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
"""/"/
ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో కూడా మెరిసింది.తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన నోరా బాలీవుడ్ పరిశ్రమ( Bollywood Industry )పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా నోరా మాట్లాడుతూ.ఇండస్ట్రీలో డబ్బు, పేరు కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మీరు ప్రేమించని వ్యక్తిని వివాహం చేసుకోవడం కంటే దారుణం ఇంకోటి లేదు.ఇష్టం లేకపోయినా ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తున్నారు.
బాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అలాంటి పనికిమాలిన వాళ్లే ఉన్నారు.వారు కేవలం ఆ సర్కిల్‌లో మాత్రమే ఉండాలని కోరుకుంటారు.
ఎందుకంటే వారి కెరీర్ ఎక్కడికి వెళుతుందో వారికి తెలియదు. """/"/
అందుకే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి అని తెలిపింది.
అనంతరం తనకు బాయ్‌ఫ్రెండ్స్( BOyfriends ) లేరన్న విషయంపై నోరా స్పందిస్తూ.చాలామంది నన్ను కేవలం వాళ్ల ఫేమ్ కోసమే వాడుకుంటున్నారు.
అందుకే అలాంటి వారు నాతో ఉండలేరు.అందుకే నేను అబ్బాయిలతో డేటింగ్ ( Dating )చేయడం మీకు కనిపించడం లేదు.
బాలీవుడ్ పరిశ్రమలో కేవలం డబ్బు, పరపతి కోసమే పెళ్లి చేసుకుంటారు.వీరంతా బార్య, భర్తలుగా కాకుండా తమ సర్కిల్‌లో డబ్బు, పేరు కోసం ఆ బంధాన్ని వాడుకుంటున్నారు.
ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మూడేళ్ల పాటు రిలేషన్ లో ఉంటున్నారు.ఆ తర్వాత అతనితో కొన్ని సినిమాలు చేసి అవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగానే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?