సినిమా అవకాశాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆంటీ అరెస్ట్....
TeluguStop.com
ప్రస్తుతం బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో అశ్లీల చిత్రాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇప్పటికే ఈ విషయమై బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి భర్తను అరెస్టు చేయగా పోలీసులు చాలా లోతుగా విచారిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు ని అరెస్ట్ చేయగా మరింత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా ఈ అశ్లీల చిత్రాల వ్యవహారంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన మరో నటిని పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే పలు హిందీ చిత్రాల్లో మరియు అడల్ట్ కంటెంట్ వెబ్ సీరీస్ లలో నటి నందిత దత్త బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
కానీ సినిమాల్లో నటించడం ద్వారా వచ్చేటువంటి డబ్బులు సరి పోకపోవడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేసింది.
ఈ క్రమంలో పలు బి గ్రేడ్ చిత్రాలు, అడల్ట్ కంటెంట్ చిత్రాలలో నటించింది.
కానీ ఈ మధ్య కాలంలో నందిత దత్త సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నూతన నటీనటులను టార్గెట్ చేసి అవకాశాల పేరుతో వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నందిత దత్త సినిమా షూటింగులో పాల్గొంటుండగానే అందరి ముందు సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది.
"""/"/
అంతేకాకుండా గతంలో నందిత దత్త ఆల్ట్ బాలాజీ మరియు ఇతర సంస్థలలో తెరకెక్కించిన అడల్ట్ కంటెంట్ చిత్రాలలో నటించింది.
దీంతో పోలీసులు నందిత దత్త కి రాజ్ కుంద్రా తో సంబంధాలు ఉన్నాయనే విషయం పై విచారిస్తున్నారు.
దీనికితోడు ఇటీవల ఇద్దరు యువతులు నందిత దత్త తమని నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి తెస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరింత లోతుగా ఈ వ్యవహారాన్ని విచారిస్తున్నారు.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!