తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన సీనియర్ హీరోయిన్....

ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా చిగురిస్తుంది ఎవరూ చెప్పలేరు.అంతేగాక ఈ ప్రేమకి వయసు, కులం, మతం, వంటి భేదాలు కూడా పెద్దగా ఉండవు.

తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "గబ్బర్ సింగ్" చిత్రంలో కెవ్వు కేక అంటూ తన హాట్ హాట్ అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలీవుడ్ బ్యూటీ "మలైకా అరోరా" గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ప్రస్తుతం మలైకా అరోరా కి దాదాపుగా 45 ఏళ్లు పైబడినప్పటికీ యోగా మరియు ప్రత్యేక ఆహార డైట్ అలాగే జిమ్ వర్కవుట్లు వంటి వాటి కారణంగా చాలా యంగ్ గా ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ ఇప్పటికీ వన్నె తరగని అందంతో మతి పోగొడుతోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ద్వారా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈరోజు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ పుట్టినరోజు కావడంతో తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసింది అంతేకాకుండా ఈ ఫోటో కి "హ్యాపీ బర్తడే మై సన్ షైన్" అని క్యాప్షన్ కూడా పెట్టింది.

దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఫోటోని లైక్ చేస్తున్నారు.అయితే గత కొద్ది కాలంగా నటి మలైకా అరోరా అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిందని అంతేకాకుండా వీరిద్దరు తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కానీ మలైకా అరోరా మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు.కానీ కానీ ఒక్కసారిగా ఈ అమ్మడు అర్జున్ కపూర్ తో దిగినటువంటి ఫోటో ని షేర్ చేయడంతో తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మళ్ళీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి మలైకా అరోరా 1998వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడైన "ఆర్భాజ్ ఖాన్" ను పెళ్లి చేసుకుంది.

కానీ పెళ్లయిన 19 సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడంతో 2017 సంవత్సరంలో విడాకులు తీసుకుంది.

దీంతో అప్పటి నుంచి మలైకా ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఒంటరిగా ఉంటోంది.

కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!