కూతురి ఫోటోలను డిలీట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ అలియా.. నిర్ణయం వెనుక కారణాలివే!

అలియా భట్.( Alia Bhatt ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.కాగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.మరి ముఖ్యంగా తన ముద్దుల కూతురు రాహా కపూర్( Raha Kapoor ) ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

"""/" / అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో తన కూతురి ఫోటోలు షేర్ చేసే ఆలియా భట్ తాజాగా ఉన్నట్టుండి తన కూతురి ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది.

దీంతో ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) పై దాడి తర్వాత ఆలియా రాహా కోసం కూడా నో ఫోటో పాలసీని అమలు చేస్తుందనే చర్చ జరుగుతోంది.

అలియా నిర్ణయం తర్వాత అభిమానులు కూడా షాక్ అయ్యారు.అదే సమయంలో చాలా మంది ఆమె నిర్ణయాన్ని కూడా సమర్థించారు.

అలియా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనక రాహా భద్రత ప్రధాన కారణం ఉంది అని అభిమానులు చెబుతున్నారు.

"""/" / నిజం చెప్పాలంటే జనవరి 16న, సైఫ్, కరీనా ఇంట్లోకి తెలియని వ్యక్తి ప్రవేశించాడు.

పిల్లలపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు.దాడి చేసిన వ్యక్తి బారి నుంచి పిల్లలను రక్షించే క్రమంలో సైఫ్ తీవ్రంగా గాయ పడ్డాడు.

గుర్తు తెలియని వ్యక్తి సైఫ్‌ ను ఆరుసార్లు కత్తితో పొడిచాడు.ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తీవ్ర రక్త స్రావంతో ఆసుపత్రిలో చేరాడు.

ఆ సంఘటన తర్వాత, సైఫ్ కరీనా తైమూర్, జెహ్ కోసం నో ఫోటో పాలసీ ని కూడా అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సైఫ్ పై దాడి తర్వాత, ఆలియా కూడా రాహా ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించిందని చర్చ జరుగుతోంది.

ఈ విషయంపై ఆలియా భట్ స్పందించాల్సి ఉంది.ఇకపోతే ఆలియా విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది.

పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు.