జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో మీకు తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే.

ఆర్యన్ బెయిల్ పిటిషన్ నిన్న మరోసారి తిరస్కరణకు గురైంది.కొడుకుకు బెయిల్ వస్తుందని షారుఖ్ ఖాన్ భావించగా ఎన్సీబీ అధికారులు ఇచ్చిన ట్విస్ట్ వల్ల ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాలేదు.

ఆర్యన్ ఖాన్ తన చాటింగ్ లో ఒక హీరోయిన్ తో డ్రగ్స్ గురించి చర్చించారు.

మరోవైపు కొందరు డ్రగ్స్ సరఫరాదారులతో ఆర్యన్ ఖాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆర్యన్ తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరికి సైతం కోర్టు బెయిల్ ను నిరాకరించడం గమనార్హం.

ఆర్యన్ ఖాన్ ఈ నెల 3వ తేదీన అరెస్ట్ కాగా అప్పటినుంచి ఆర్యన్ ఖాన్ రిమాండ్ లోనే ఉండటం గమనార్హం.

ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన హీరోయిన్ ఎవరనే చర్చ కూడా బాలీవుడ్ లో జోరుగా జరుగుతోంది.

అయితే గతంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జైలు శిక్షను అనుభవించారు.1998 సంవత్సరంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యారు.

"""/"/ ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారనే విషయం తెలిసిందే.

1993 సంవత్సరంలో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ జైలుపాలయ్యారు.

2001 సంవత్సరంలో ఫిరోజ్ ఖాన్ కొడుకు ఫర్దీన్ ఖాన్ డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడటం గమనార్హం.

"""/"/ ప్రముఖ నటి సోనాలి బింద్రే మతాన్ని కించరించారనే ఆరోపణలతో జైలుపాలయ్యారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.

ఈ నటి నెలరోజుల పాటు జైలుశిక్షను అనుభవించారు.అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ హీరోగా పేరును సొంతం చేసుకున్న షైనీ ఆహుజా పనిమిషిని అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు.

మిష్టర్ బచ్చన్ కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…