సామాన్యుడి కలను నిజం చేసిన సోనూసూద్.. ఆ వ్యక్తి లైఫ్ లో వెలుగు నింపడంతో?

రియల్ హీరో సోనూసూద్( Real Hero Sonusood ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు.ఇప్పటికి కూడా సోనూసూద్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

సోనూసూద్ ఫౌండేషన్( Sonusood Foundation ) ద్వారా ఈ నటుడు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజాగా సోనూసూద్ సామాన్యుడి కలను నిజం చేశారు. """/"/ పైలట్( Pilot ) కావాలనుకున్న వ్యక్తి జీవితంలో సోనూసూద్ వెలుగులు నింపారు.

ఒక వ్యక్తి సోనూసూద్ కు వీరాభిమాని కాగా చిన్నప్పటి నుంచి అతనికి పైలట్ కావాలనే ఉన్నత లక్ష్యం ఉండేది.

అయితే ఆర్థిక పరిస్థితి, ఇతర కారణాల వల్ల ఆ వ్యక్తికి తన కలలను నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

కుటుంబ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో తన కల నెరవేరదేమో అని ఆ వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు.

ఎయిర్ లైన్( Airline ) లో హెల్పర్ గా, క్లీనర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆ సామాన్యుడు సోనూసూద్ ఫౌండేషన్ సహాయంతో ప్రస్తుతం ఏవియేష‌న్ అకాడ‌మీ( Aviation Academy )లో గ్రౌండ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌గా పని చేస్తుండటం గమనార్హం.

సోనూసూద్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందిన ఈ సామాన్యుడు ఇప్పుడు పైలట్ గా మారారు.

ఈ పైలట్ పేరు వంశీ కాగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు.

"""/"/ వంశీ( Vamsi ) తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా వంశీ ఈ విషయాలను పంచుతున్నారు.

సోనుసూద్ గారితో పాటు సతీష్ సార్ నాకు ఎంతో సహాయం చేశారని వంశీ అన్నారు.

వంశీ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.వంశీ కెరీర్ పరంగా ఎదిగిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తాను చేసిన సహాయాలను చెప్పుకోవడానికి కూడా సోనూసూద్ ఇష్టపడటం లేదంటే ఆయన మనస్సు ఎంత మంచిదో అర్థమవుతుంది.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?