బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‎కు మరోసారి బెదిరింపులు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‎కు మరోసారి బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.ఈ మేరకు సల్మాన్ కు ఈ మెయిల్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీబ్రార్ తో పాటు మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం.

లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి.

లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది.ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే గోల్డీభాయ్ తో ముఖాముఖి మాట్లాడాలని ఈ మెయిల్ లో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

భారతీయుల అక్రమ రవాణా .. యూకేలో ఇద్దరు వ్యక్తులకు జైలు