న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ .. నటుడు పంకజ్ త్రిపాఠికి అరుదైన గౌరవం

78వ భారత స్వాతంత్ర్య వేడుకలను( 78th Indian Independence Celebrations ) భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.

మనదేశంతో పాటు భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లోనూ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అగ్రరాజ్యం అమెరికాలోని పలు నగరాల్లోనూ మన ఇండిపెండెన్స్ డే వేడుకల్ని ప్రవాస భారతీయులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ( Mayor Eric Adams )పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

న్యూయార్క్‌, అమెరికాల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని.భారత్ - అమెరికాల బంధం ఇంకా బలోపేతం కావాలని ఆడమ్స్ ఆకాంక్షించారు.

ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

డిప్యూటీ మేయర్, భారత సంతతికి చెందిన మీరా జోషితో ( Meera Joshi )పాటు పలువురు నగర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

"""/" / ఇదిలాఉండగా న్యూయార్క్‌లో( New York ) ఆదివారం జరిగిన ఇండియా డే పరేడ్‌లో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి( Actor Pankaj Tripathi ) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ మెగా పరేడ్‌లో భారతదేశ సందేశమైన వసుదైవ కుటుంబం , మన దేశ సాంస్కృతిక వారసత్వం ప్రదర్శించబడుతుందని త్రిపాఠి అన్నారు.

వసుదైవ కుటుంబం అనే సందేశాన్ని అమెరికాలోని( America ) ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు.

ప్రపంచమంటే గ్లోబల్ విలేజ్ అని.సినిమా అంటే మన కథలు, వారసత్వం, సంస్కృతిని ప్రపంచానికి చూపించే సాఫ్ట్ పవర్ అని త్రిపాఠి అన్నారు.

"""/" / ప్రవాస భారతీయ సంస్థ .‘‘ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఎన్‌వై, ఎన్‌జే, సీటీ, ఎన్ఈ ’’లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

మన్‌హట్టన్ ( Manhattan )నడిబొడ్డున్న ఉన్న మాడిసన్ అవెన్యూలో ఈ కార్యక్రమం జరిగింది.అతిపెద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ ప్రదర్శించడంతో పాటు దేశభక్తి గేయాలు మారుమోగుతాయి.

త్రిపాఠితో పాటు నటుడు, రాజకీయవేత్త మనోజ్ తివారీ , బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్‌లు కూడా హాజరుకానున్నారు.

పెళ్లయిన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక.. ఫోటోలు వైరల్!