2034 లో నువ్వే సీఎం.. ఎన్టీఆర్ జోస్యం చెప్పిన బాలీవుడ్ నటుడు?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈయన వార్ 2 (War 2 )సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబై వెళ్లారు హృతిక్ రోషన్( Hruthik Roshan ) తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో ఉంటున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముంబైలోని ఓ పార్టీలో పాల్గొన్నాడు.

ఎమ్మెల్యే జీషన్‌ బాబా సిద్ధిఖీతోపాటు బాలీవుడ్‌ నటుడు అక్బర్ బిన్‌ తబర్‌ ఈ పార్టీలో పాల్గొన్నాడు.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్‌ ఎన్టీఆర్‌ని గుర్తు చేశారు నటుడు అక్బర్‌.

ఎన్టీఆర్‌.అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన వాయిస్‌ చాలాస్పెషల్‌ అని తెలిపారు.

 అలా ఎన్టీఆర్ వాయిస్ చాలా స్పెషల్ అయితే ఆ వాయిస్ ఇప్పుడు నేను మీలో చూస్తున్నానని తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సూపర్‌ స్టార్లు ఉన్నారు.వాళ్లందరికి నువ్వు ఫాదర్‌వి అంటూ ప్రశంసలు కురిపించారు.

"""/" / అప్పటి ఎరా మళ్ళీ రాబోతుందని ఈయన తెలిపారు.2034 ఎన్నికల్లో మీరే సీఎం అంటూ జోస్యం చెప్పాడు నటుడు అక్బర్‌.

ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఈయన మాటలకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు చేతులలోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతూ అవమానిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు సందర్భాలలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో ….120 మంది దత్తత తీసుకున్న విష్ణు!