పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్న బొలిశెట్టి వ్యవహారం?
TeluguStop.com
జనసేన( Janasena ) పార్టీలో గుర్తింపు కలిగిన నేతల్లో బొలిశెట్టి సత్యనారాయణ( Bolishetti Satyanarayana ) ఒకరు .
మీడియా సమావేశాల తో పాటు పార్టీ సమావేశాలలో కూడా జనసేన వాయిస్ ను బలంగా వినిపించే ఈ నేత జనసేన కార్యకర్తలకు సోషల్ మీడియా వ్యవహారాలపై దిశ నిర్దేశం చేస్తుంటారు .
ప్రతిపక్ష విమర్శలను కూడా సమర్థంగా ఎదుర్కొంటారు.ఒకప్పుడు కాంగ్రెస్( Congress ) నేతగా పనిచేసిన ఈయన కు చంద్రబాబు( Chandrababu ) వ్యవహార శైలి పై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతగా పేరు ఉంది ఇటీవల ఈయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ కు ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తుంది.
తెలుగుదేశం జనసేన పార్టీలు అవగాహనతో ముందుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్న దరిమిలా పొత్తు ఇక లాంచనప్రాయమేనన్న అభిప్రాయాల మధ్య ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పొత్తుకు విఘాతంగా పరిణమించే అవకాశం ఉన్నదని తెలుస్తుంది.
"""/" /
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడని నిత్యం విమర్శిస్తున్న వైసిపి ( YCP )విమర్శలకు తెలుగుదేశం పార్టీ నుంచి గాని చంద్రబాబు నాయుడు నుంచి గాని ఎటువంటి ఖండన గాని ప్రతి విమర్శ గాని లేకపోవడం ఏ సంకేతాలు ఇస్తుందంటూ ఆయన చేసిన ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈయన వ్యాఖ్యలకు అనుకూలంగా కొంతమంది ప్రతికూలంగా కొంతమంది జనసైనికులు పోస్టులు చేస్తూ ఈ విషయాన్ని హార్ట్ డిబేట్ గా మార్చేశారు ఇప్పుడు వ్యవహారం జనసేన అధిష్టానానికి తలపోటు వ్యవహారంలో మారిందని తెలుస్తుంది.
"""/" / ఈ తరహా వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీస్తాయని పొత్తుకు ఇబ్బందికర వాతావరణo తీసుకొస్తాయని జనసేన అధిష్టానం భావిస్తున్నదట.
అయితే పార్టీలో ప్రాముఖ్యత కలిగిన నేతగా నిజాయితీ పరుడుగా పేరున్న బోలిశెట్టి వంటి నేతలను కంట్రోల్ చేసేలా వ్యవహరించడం కూడా పార్టీకి మంచి సంకేతాలు ఇవ్వదని అభిప్రాయంలో అధిష్టానం ఉందట.
వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన దశలో ఇలా బహిరంగంగా విమర్శించడం వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతుందన్న విషయాన్ని ఆయనకు సూచనప్రాయంగా చెప్పి పరిస్థితులు మార్చాలని ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తుంది.
నటి కస్తూరిపై కేసు నమోదు.. క్షమాపణ చెప్పిన వదలడం లేదుగా!