అమెరికా : సరస్సులో ఇద్దరు భారతీయ విద్యార్ధులు గల్లంతు.. 72 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ , చివరికి
TeluguStop.com
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.సరస్సులో గల్లంతైన ఇద్దరు భారతీయ విద్యార్ధుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
వీరి ఆచూకీ కోసం 72 గంటల పాటు పోలీసులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలించారు.
వీరిని ఇండియానా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధులు సిద్ధాంత్ షా( Siddhant Shah ) (19), ఆర్యన్ వైద్య( Aryan Vaidya ) (20)గా గుర్తించారు.
ఏప్రిల్ 15న వీరు తమ స్నేహితులతో కలిసి ఇండియానాపోలిస్ డౌన్‌టౌన్‌కు నైరుతి దిశలో 64 మైళ్ల దూరంలో వున్న మన్రో సరస్సు వద్ద ఈతకు వెళ్లారు.
10,750 ఎకరాలు విస్తీర్ణం, 35 నుంచి 40 అడుగుల లోతున్న ఈ సరస్సులో మృతులు, వారి స్నేహితులు ఈత కొట్టడానికి ముందు పాంటూన్‌పై బోటింగ్ చేస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలో సిద్ధాంత్, ఆర్యన్‌లు ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయారు.వీరిని కాపాడేందుకు తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
వీరిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యాధునిక సోనార్( Sonar ), అనుభవజ్ఞులైన స్కూబా డైవర్లను( Scuba Ers ) ఉపయోగించి సరస్సు అడుగు భాగంలో గాలించారు.
అయితే ప్రతికూల వాతావరణం కారణంగా తొలి రోజు రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు.చివరికి ఏప్రిల్ 18న పేన్‌టౌన్ మెరీనాకు తూర్పున సరస్సుకు 18 అడుగుల లోతులో వీరి మృతదేహాలను గుర్తించారు.
ఇండియానా యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీసెస్( Indiana University Student Services ) .
విద్యార్ధుల బృందంలోని మిగిలిన వారిని క్యాంపస్‌కు తరలించింది.వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్ధుల మరణంతో అక్కడ విషాదం నెలకొంది.
"""/" /
ఇకపోతే.కొద్దిరోజుల క్రితం ఏప్రిల్ 9న మిస్సయిన 30 ఏళ్ల భారత సంతతి టెక్కీ మృతదేహాన్ని మేరీల్యాండ్‌లోని చిన్న సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడిని అంకిత్ బగైగా (Ankit Bagai )గుర్తించారు.గత మంగళవారం లేక్ చర్చిల్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.మృతదేహాన్ని వెలికి తీసి, అనంతరం చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారు.
మృతుడిని జర్మన్‌టౌన్‌కు చెందిన అంకిత్ బగైగా గుర్తించినట్లు మోంటోగోమెరీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
వైరల్ వీడియో: ఇలా ఉన్నరేంట్రా.. థియేటర్‌లో ఉచిత పాప్‌కార్న్ ఇవ్వడంతో ఏకంగా?