మరోసారి సందీప్ కిషన్ కి విలన్ గా మారుతున్న బాబీ సింహ

కోలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న నటుడు బాబీ సింహా.

తెలుగువాడైనా తమిళనాడులో సెటిల్ అయ్యి కోలీవుడ్ లోనే సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన బాబీ సింహ, విజయ్ సేతుపతి రూమ్ మేట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు.

ఇద్దరూ ఒకేసారి కెరియర్ ప్రారంభించి ఓకే సారి సక్సెస్ అయ్యారు.వీరికి దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కూడా మిత్రుడు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో స్టార్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొంది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్ట్ లలో ఒకరిగా ఉన్నా తెలుగులో పరిచయం కావడానికి చాలా సమయం పట్టింది.

సందీప్ కిషన్ రన్ సినిమాతో ఈ యువ టాలెంటెడ్ నటుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాలో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేసిన కూడా సినిమా డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తులేకుండా పోయాడు.

ఇదిలా ఉంటే కెరియర్ ఆరంభంలో లవ్ ఫెయిల్యూర్ సినిమా చేసినా అది హీరో ఫ్రెండ్ రోల్ మాత్రమే, తరువాత అనుష్క సైజ్ జీరోలో చేసింది క్యామియో రోల్.

పూర్తి స్థాయి నటుడుగా మాత్రం రన్ సినిమానే చేశాడు.తరువాత ఏదైనా జరగొచ్చు అనే చిన్న సినిమాలో విలన్ గా నటించాడు.

ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.డిస్కో రాజాలో కూడా పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు.

అది కూడా చేదు అనుభవమే మిగిల్చింది.అయితే చాలా గ్యాప్ తర్వాత మరల సందీప్ కిషన్ కి విలన్ గా బాబీ సింహా కనిపించబోతున్నాడు.

జి నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో బాబీ సింహ కూడా కామెడీ టచ్ ఉన్న విలన్ గా విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమా అయినా తెలుగులో అతనికి కమర్షియల్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

ఎన్టీయార్ పాన్ ఇండియా డైరెక్టర్లనే ఎంచుకుంటున్నాడా..? కారణం ఏంటి..?