బాబీ డైరెక్షన్ ఒకే కానీ, ఆయన సినిమాల్లో ఆ ఒక్కటి మిస్ అవుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీసే దర్శకులు చాలామంది ఉన్నప్పటికీ అందులో కొంతమందికి మాత్రమే సపరేట్ క్రేజ్ అయితే ఉంది.

ఇక అందులో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న చాలామంది దర్శకులు వాళ్ళ సినిమా స్టైల్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక అందులో భాగంగానే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న బాబీ( Director Bobby ) ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక తన గత చిత్రం అయిన 'వాల్తేరు వీరయ్య' ( Waltair Veerayya ) సినిమాతో చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో( Balayya Babu ) భారీ సినిమాను చేస్తున్నాడు.

"""/" / ఇక ఈ సినిమాతో తను ఎలాగైనా భారీ సక్సెస్ ని కొట్టి స్టార్ డైరెక్టర్ల రేంజ్ కి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇప్పటికే బాబీ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.కానీ బాబీ విషయంలో మాత్రం ఒకటి మైనస్ అవుతుందనే చెప్పాలి.

అది ఏంటి అంటే?చాలామంది కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్ లోతో సినిమాలు చేస్తు ముందుకు సాగుతుంటే బాబీ మాత్రమే ఎప్పుడు రొటీన్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తున్నాడు అంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన వ్యతిరేకతైతే వస్తుంది.

"""/" / మరి బాలయ్య బాబు బాబీ కాంబో లో వస్తున్న సినిమా మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా అంటూ చాలా అనుమానలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక బాలయ్య బాబీ కాంబో లో వస్తున్న సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని కూడా చాలా రిచ్ గా తెరకెక్కిస్తు మాస్ అంశాలను ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

రామస్వామి నా టీమ్‌లో ఉంటాడు.. భారత సంతతి నేతపై ట్రంప్ ప్రశంసలు