ఏ దర్శకుడైనా మా నాన్నతో సమానం.. స్టార్ హీరో బాలయ్య కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ( Balakrishna )సంక్రాంతి పండుగకు డాకు మహారాజ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

టైటిల్ విభిన్నంగా ఉన్నా కొత్తగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో బాబీ ( Bobby )మాట్లాడుతూ ఏ దర్శకుడైనా మా నాన్నతో సమానం అని బాలయ్య చెప్పారని బాలయ్య నిజంగా కూడా అలానే చూస్తారని చెప్పుకొచ్చారు.

బాలయ్య చిన్న పిల్లాడిలా సెట్స్ కు వస్తారని ఏది చెబితే అది చేస్తారని బాలయ్య లాంటి హీరోను నేను ఇప్పటివరకు చూడలేదని అన్నారు.

డాకు మహారాజ్ సినిమా గురించి పంచుకోవడానికి ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయని అందుకే అన్నీ దాచుకుంటున్నానని ఒక విషయం మాత్రం చెప్పాలని అనుకుంటున్నానని బాబీ తెలిపారు.

మిడ్ నైట్ 2 గంటలకు షూట్( Shoot At 2 Midnight ) జరుగుతోందని ఆ సమయంలో షూట్ అంటే యంగ్ హీరోలు సైతం అలోచిస్తారని బాబీ అన్నారు.

"""/" / 15 రోజుల పాటు ఆ సమయంలో షూట్ చేశామని డూప్ ను పెట్టి మేనేజ్ చేద్దామని చెబితే నేను కదా గుర్రం ఎక్కాల్సింది అని చెప్పి బాలయ్య స్వయంగా చేశారని బాబీ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలోనే చేతిలో కాగడా పట్టుకొనే సీన్ లు సీన్ లు బాబీ వెల్లడించారు.

ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో ఈ సినిమాను తీశామని డైలాగ్స్ గురించి సినిమా చూశాక అర్థమవుతుందని బాబీ తెలిపారు.

"""/" / డైరెక్టర్ బాబీ గొప్ప సినిమా తీశారని ఆ స్థాయిలోనే సంగీతం అందించానని థమన్ చెప్పుకొచ్చారు.

బాలయ్యతో ఇది నా ఐదో సినిమా అని థమన్ కామెంట్లు చేశారు.డాకు మహారాజ్ పై అంచనాలు పెంచే విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

జనవరి నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

డాకు మహారాజ్ సినిమా 200 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేస్తుందా..?