బాలయ్య-బాబి కాంబోలో ఎవ్వరూ ఊహించని విలన్?

నందమూరి అందగాడు బాలయ్య( Balayya ) సినిమా వస్తుందంటే, నందమూరి అభిమానులకు పండగే పండగ.

తండ్రి విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపైకి అడుగు పెట్టిన బాలయ్య అనతి కాలంలోనే మాస్ హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు.

ఈ క్రమంలో వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించాడు.ఆయన సినిమా కెరీర్ లోని ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బిలి పులి, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు ఊపేసాయి.

"""/" / వృద్ధాప్య దశకు చేరుకున్న బాలయ్య సినిమా విషయంలో అదే జోరు కనబరుస్తున్నారు.

తాజాగా బాబీ దర్శకత్వంలో( Director Bobby ) ఓ సినిమాకు కమిట్ అయ్యారు బాలయ్య.

ఈ సినిమా షూటింగు శరవేగంగా సాగుతోంది.ఈ నేపథ్యంలోనే, ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదే ఈ సినిమాలోని విలన్ రోల్( Villain Role ) గురించి.బాలయ్య సినిమాలోని విలన్ అంటే మాటలా? బాలయ్య కి ధీటుగా ఉండాలి కదా.

అందుకే బాలయ్య గత సినిమాల కంటే కూడా తాజా సినిమాలోని విలన్ రోల్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు కనబడుతోంది.

"""/" / ఈ సినిమాకి గాను, మలయాళ లవర్ బాయ్ దుల్కర్ సల్మాన్ ని( Dulquer Salmaan ) విలన్ రోల్ కోసం అడిగినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ, ఈ న్యూస్ విన్న నాటి నుండి నందమూరి అభిమానులు కాస్త అసహనంగా ఉన్నట్టు టాక్ వినబడుతుంది.

బాలయ్య సినిమా అంటే విలన్ రోల్ దద్దరిల్లిపోతుంది కదా! అలాంటి రోల్ దుల్కర్ సల్మాన్ ఏం చేస్తాడు అన్నట్టు పెదవి విరుస్తున్నారు.

అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం.జగపతిబాబు విలన్ గా చేసినప్పుడు దుల్కర్ సల్మాన్ విలన్ గా చేసి ఎందుకు మెప్పించ కూడదు? అనే ప్రశ్నలు వేస్తున్నారు.

మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటో? కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి!.