కారు నెంబర్ ‘కోవిడ్-19’.. కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయింది!?

ఏంటి ? కొన్ని నెలల ముందే కోవిడ్-19 ఆ? అని షాక్ అవుతున్నారా? అవును.

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విమానాశ్రయంలో పార్కు చేసిన ఓ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.బూడిద రంగులో ఉన్న ఈ కారును సుమారు ఫిబ్రవరి నెలలో పార్కు చేశారని విమానాశ్రయ పార్కింగ్ సిబ్బంది తెలిపారు.

అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏంటి అంటే? ఆ కారుపై కోవిడ్-19 అని ఉందని.

అలాంటి నెంబర్ ప్లేటు తో కారు ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు.ఈ కారు నెంబర్ రిజిస్ట్రేషన్ పరిశీలించగా ఆ కారు నెంబర్ ను కేవలం సెప్టెంబరు 2020 వరకు రిజిస్టర్ చేసి ఉన్నట్లు తెలిసింది.

ఆ కారుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.కాగా ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ లాక్‌డౌన్ విధించడం వల్ల విమానాశ్రయ సిబ్బందిలో ఒకరు కారును అక్కడే పార్కు చేసి వెళ్లిపోయి ఉండచ్చు అంటున్నారు.

అయితే ఇన్ని రోజులు ఆ కారుకు కవర్ వేసి ఉందని, ఇటీవల వీచిన ఈదురు గాలుల వల్ల కవర్ పైకి లేవడంతో కారు నెంబరు ప్లేటు కనిపించిందని విమాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు.

దీంతో ఈ కారు గురించి అధికారులకు పూర్తిగా వివరాలు తెలిసి ఉంటాయని.యజమాని ప్రైవసీ నిమిత్తం వివరాలను బయటకు రావడం లేదని మరికొందరు అంటున్నారు.

కాగా కోవిడ్-19 అని పేరు ఎందుకు రిజిస్టర్ చేశారు? దీని వెనుక రహస్యం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

ఏది ఏమైనా ఈ కారు నెంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. గొప్పోడంటూ?