జ్ఞాపకశక్తి లోపిస్తుందా..అయితే ఈ పండు తినాల్సిందే!
TeluguStop.com
జ్ఞాపకశక్తి లోపించడం.యాబై, అరవై ఏళ్లు దాటాక ఈ సమస్య కనిపించడం చాలా కామన్.
అయితే నేటి కాలంలో ముప్పై, నలబై ఏళ్లకే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆహారపు అలవాటు, మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మెదడు ఇన్‌ఫెక్షన్స్, మద్యపానం, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, విటమిన్ల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల మెదడు పని తీరు తగ్గి జ్ఞాపకశక్తి లోపిస్తుంది.
దాంతో చిన్న చిన్న విషయాలను కూడూ గుర్తు పెట్టుకోలేకపోతుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల ద్వారా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
అలాంటి ఆహారాల్లో బ్లూ బెర్రీ ముందుంటుంది.ఈ బ్లూ బెర్రీ పండులో అనేక పోషకాలు నిండి ఉంటాయి.
ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్స్, కార్పోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు బ్లూ బెర్రీస్‌లో ఉంటాయి.
అటువంటి బ్లూ బెర్రీస్‌ను తినడం వల్ల.బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
"""/" /
ముఖ్యంగా మెదడుకు కావాల్సిన అన్ని పోషకాలు బ్లూ బెర్రీస్ లో ఉంటాయి.
అందువల్ల జ్ఞాపకశక్తి లోపిస్తున్న వారు ప్రతి రోజు బ్లూ బెర్రీస్‌ను తీసుకుంటే.అందులో ఉండే యాంటీ ఆక్సిడేటివ్ ఫైటో కెమికల్స్ జ్ఞాపక శక్తి పెరుగుదలకి తోడ్పడతాయి.
జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి.అయితే బ్లూ బెర్రీస్ చాలా మంది డైరెక్ట్‌గా తీసుకోవడానికి ఇష్టపడరు.
అలాంటి వారు బ్లూ బెర్రీస్‌ను ఓట్స్, మొలకలు, పెరుగన్నంతో కలిపి తినవచ్చు.లేదంటే జ్యూస్‌లా తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు.
ఇలా ఎలా తీసుకున్నా మెదడుకు చాలా మేలు జరుగుతుంది.ఇక బ్లూ బెర్రీస్ తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వొచ్చు, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది, గుండె జబ్బులు కూడా దరి చేరకుండా ఉంటాయి.
మ్యాట్రిమోని మోసాలపై హెచ్చరిక చేసిన సజ్జనార్