రోజూ ఈ టీ తాగితే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట..తెలుసా?
TeluguStop.com

ఇటీవల రోజుల్లో బాగా ప్రాచూర్యం పొందిన టీల జాబితాలో బ్లూ టీ కూడా ఒకటి.


అపరాజిత పుష్పాలతో బ్లూ టీ తయారు చేస్తారు.అపరాజిత పుష్పాలను తెచ్చుకుని ఇంట్లోనే బ్లూ టీ పౌడర్‌ను తయారు చేసుకోవచ్చు.


లేదా మార్కెట్‌లో బ్లూ టీ పౌడర్ విరి విరిగా లభ్యమవుతున్నాయి .ఇక గ్రీన్ టీ, బ్లాక్ టీలతో పోలిస్తే బ్లూ టీలోనే పోషకాలు మెండుగా ఉంటాయి.
పైగా ఇందులో ఎటువంటి కెఫీన్ ఉండవు.అందువల్ల రెగ్యులర్‌గా బ్లూ టీని తీసుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం బ్లూ టీను రోజూ తీసుకుంటే ఏయే ప్రయోజనాలు లభిస్తాయో ఓ లుక్కేసేయండి.
ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాలా మంది క్యాన్సర్‌కు గురై ప్రాణాలు విడుస్తున్నారు.
అయితే ప్రతి రోజు ఒక కప్పు బ్లూ టీ తాగితే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అవును, బ్లూ టీలో ఉండే పలు పోషకాలు శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని అంతం చేస్తాయి.
"""/" /
బ్లూ టీని ప్రతి రోజూ సేవించడం వల్ల మెదడు పని తీరు మునుపటి కంటే చురుగ్గా మారుతుంది.
దాంతో జ్ఞాపక శక్తి మరియు ఆలోచనా శక్తి రెండూ రెట్టింపు అవుతాయి.అదే సమయంలో మతిమరుపు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడుతుంది.
అలాగే వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి బ్లూ టీనే బెస్ట్ అప్షన్‌గా చెప్పుకోవచ్చు.
మిగిలిన టీలతో పోలిస్తే బ్లూ టీ ద్వారానే ఫాస్ట్‌గా బరువు తగ్గొచ్చు.ఇక బ్లూ టీని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరుస్తుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.శరీరంలో వ్యర్థాలన్నీ బయటకు పోయి మూత్ర పిండాలు శుభ్ర పడతాయి.
మరియు రక్తంలో చెక్కెర స్థాయిలూ అదుపులో ఉంటాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి18, మంగళవారం 2025