జెఫ్ బెజోస్ గీసిన బొమ్మల్ని కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లిన బ్లూ ఆరిజిన్..

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ "బ్లూ ఆరిజిన్‌" అనే స్పేస్‌ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఈ స్పేస్ ఏజెన్సీ ఓ రాకెట్‌ను సైతం రూపొందించి అంతరిక్షానికి విజయవంతంగా పంపించింది.

దీనితో అంతరిక్ష ప్రయాణానికి ఒక ముందడుగు పడిందనే చెప్పాలి.బెజోస్‌ సామాన్య ప్రజలకు కూడా స్పేస్ టూరిజం సేవలు అందించాలనే లక్ష్యంతో వడివడిగా ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బ్లూ ఆరిజిన్‌ మరో మానవసహిత రాకెట్‌ను స్పేస్ లోకి పంపించింది.

ఈ వ్యోమనౌకలో వ్యోమగాములతో పాటు కొన్ని బొమ్మలు కూడా స్పేస్ లో చక్కర్లు కొట్టి వచ్చాయి.

బెజోస్‌ చిన్నతనంలో అంతరిక్షం గురించి కొన్ని బొమ్మలు గీశారు.ఆ బొమ్మలే తాజాగా అంతరిక్షంలోకి వెళ్లొచ్చాయి.

ఈ ఆసక్తికర విషయాన్ని బెజోస్‌ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.తన తొమ్మిదేళ్ల వయసులో స్టార్‌ట్రెక్‌ టీవీ సిరీస్‌లో యూజ్ చేసిన ట్రైకార్డర్స్‌, కమ్యూనికేటర్స్‌ను కాగితంపై గీసి వాటితో ఆడుకునేవాడినని బెజోస్‌ వివరించారు.

ఆ బొమ్మలను తన అమ్మ 48 సంవత్సరాలుగా సురక్షితంగా దాచిపెట్టిందని.అవి ఇటీవలే తన కంట పడ్డాయని బెజోస్‌ చెప్పుకొచ్చారు.

వాటిని విలియమ్‌ శాంట్నర్‌ స్పేస్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. """/"/ తాజాగా బ్లూ ఆరిజిన్‌ చేపట్టిన అంతరిక్షయాత్రలో వెళ్లొచ్చిన సభ్యుల్లో విలియమ్‌ శాంట్నర్‌ కూడా ఒకరు.

ఇతను 1966 కాలంలో బాగా పాపులర్ అయిన "స్టార్‌ట్రెక్‌" అనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ టీవీ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు.

బెజోస్‌ ఆ సిరీస్‌ చూస్తూనే పెరిగారు.ఆ సిరీస్ ఎపిసోడ్స్ చాలా ఇష్టంతో చూసేవారు.

ఆ సిరీస్‌లో నటించిన నటీనటులపై ఎంతో అభిమానం పెంచుకున్నారు.ఆ అభిమానంతోనే శాంట్నర్‌ను అంతరిక్షయానానికి పంపించారు.

ఇప్పుడు అతని వయస్సు 90 సంవత్సరాలు.దీంతో అంతరిక్షానికి వెళ్లిన అతి పెద్ద వయస్కుడిగా శాంట్నర్‌ అరుదైన రికార్డును నెలకొల్పారు.

నథింగ్ నుంచి 2 సరికొత్త ఇయర్ బడ్స్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?