నీలం రంగు అరటిపండ్ల గురించి మీకు తెలుసా.. అవి ఎక్కడ పండిస్తారంటే..!

అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతమంచిదో అందరికి తెలిసిందే.డాక్టర్లు కూడా ఆరోగ్యం గా ఉండాలంటే ఫ్రూట్స్ తినమని అంటారు.

వారు ప్రిఫర్ చేసే పడ్లలో అరటిపండు కూడా ఉంటుంది.ముఖ్యంగా వ్యాయామ సమయాల్లో ఈ అరటి పండు చాలా శక్తిని ఇస్తుంది.

ఇన్ స్టంట్ ఎనర్జీ కోసం కూడా అరటి పండు ఒకటి తింటే చాలని చెబుతుంటారు.

అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన అరటి పండ్లు యెల్లో, గ్రీన్ కలర్స్ లో ఉంటాయి.

కాని కొత్తగా బ్లూ కలర్ బనానాస్ మార్కెట్ లోకి వస్తున్నాయి.అదేంటి నీలం రంగు బనానాలా అవి తినేవేనా అనుకోవచ్చు.

మనం రెగ్యులర్ గా తినే యెల్లో, గ్రీన్ కలర్ అరటి పండ్ల కన్నా ఎక్కువ తియ్యంగా ఉంటాయట ఇవి.

వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీం లానే ఈ బ్లూ కలర్ బనానా టేస్ట్ ఉంటుందని అంటున్నారు.

ఇంతకీ ఈ అరటి పండ్లు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆగ్నేయాసియాలో పండిస్తారని తెలుస్తుంది.

హవాయి దీవులలో ఈ రకం అరటి తోటలు ఉన్నాయని సమాచారం.దక్షిణ అమెరికాలో కూడా ఇవి పండిస్తారని తెలుస్తుంది.

చల్లటి, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో వీటి దిగుబడి ఉంటుందట.ఈ అరటిని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, లూసియానాలలో ఎక్కువగా పండిస్తారట.

టీడీపీకి ఈసీ లొంగిపోయింది..: పేర్ని నాని