సాయిరెడ్డికి ఎదురు దెబ్బ.. కీలక బాధ్యతల నుంచి తప్పిస్తారా ?
TeluguStop.com
    
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి.పార్టీ అధినేత జగన్‌కు అత్యంత విశ్వసనీయుడు.
 
   
విజయసాయిరెడ్డి విషయం హాట్ టాపిక్‌గా మారింది.ఆయన ఇప్పటి వరకు పార్టీకి కళ్లు చెవులుగా ఆయన వ్యవహరించారు.
 
   
పార్టీలో తీసుకునే కీలక నిర్ణయాలవిషయంలోనూ ఆయన జోక్యం ఎక్కువగా నే ఉంటుం ది.
 
   ముఖ్యంగా అటు ఢిల్లీలో వైసీపీ సర్కారుకు అన్నీతానై విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు.ఇటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ తనదే కీలకపాత్ర.
 
   మొన్నామధ్య ఉత్తరాంధ్రలో సాయిరెడ్డిపై వ్యతిరేకత వచ్చింది.అయితే.
 
   దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్.నాయకులను పిలిచి క్లాస్ ఇచ్చారు.
 
   సాయిరెడ్డిమాటే వినాలని చెప్పారు.ఇంతగా వాల్యూ ఇచ్చిన సాయిరెడ్డికి.
 
   ఇప్పుడు పార్టీలో ఎదురుగాలి వీస్తోంది.ముఖ్యం గా సీఎంజగన్ కు ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం అందింది.
 
   ప్రస్తుతం సాయిరెడ్డి.రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడు.
 
   అదేవిధంగా పార్టీ పార్లమెంటరీ పక్ష ఉమ్మడి నాయకుడిగా కూడా ఉన్నారు. """/"/
అయితే.
 
   ఇటీవ ల ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఉద్దేశించి తనువు.
 
   టీడీపీతో.మనసు టీడీపీతో ఉందని కామెంట్ చేశారు.
 
   ఇది పెను దుమారానికి దారి తీసింది.అయితే.
 
   తర్వాత రోజు.తన మాటలకు సాయిరెడ్డి సారీ చెప్పారు.
 
   అయితే.ఈ వివాదం అక్కడితో సమసి పోయిందని అనుకున్నా.
 
   బీజేపీ నేతలు ముఖ్యంగా.జీవీఎల్ వంటివారు .
 
   సాయిరెడ్డిపై చర్యలకు పట్టుబడుతున్నారు.ఈ క్రమంలో నేరుగా బీజేపీ చర్యలు తీసుకుంటే.
 
   వైసీపీకి సానుభూతి పెరుగుతుందని.భావించిన బీజేపీ కేంద్ర నాయకులు .
 
   ఆ పనేదో.వైసీపీ అధినేత జగన్‌తోనే చేయించాలని నిర్ణయించుకుంది.
 
   సాయిరెడ్డిని పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కేంద్రంలోని కీలక నేత నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని.
 
   తాడేపల్లి వర్గాల గుసగుస.ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.