మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులు మరి రెండో సినిమా ఎప్పుడు

అవ‌కాశాలు ఊరికే రావు.వ‌చ్చిన వాటిని వ‌దులుకోకూడ‌దు.

సేమ్ అలాగే.త‌మ‌కు వ‌చ్చిన తొలి అవ‌కాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు కొంద‌రు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు.

ఫ‌స్ట్ మూవీతోనే స‌త్తా చాటుకున్నారు.అదే ఊపుతో బోలెడు అవ‌కాశాలు వ‌చ్చినా.

ఆచితూచి అడుగులు వేస్తున్నారు.రెండో సినిమాతోనూ సూప‌ర్ హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు.

ఇంత‌కీ ఫ‌స్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన ద‌ర్శ‌కులు ఎవ‌రు? వారి సెకెండ్ సినిమా ముచ్చ‌ట్లేంటి? అనే విష‌యాన్ని ఇప్పుడు చూద్దాం! సందీప్ వంగ: త‌న‌కు వ‌చ్చిన తొలి అవ‌కాశాన్నే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా మ‌ల్చుకున్నాడు సందీప్ వంగ.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమా తీసి మంచి విజ‌యం అందుకున్నాడు.

ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి.

అక్క‌డ కూడా మంచి స‌క్సెస్ అందుకున్నాడు.ప్ర‌స్తుతం ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో మూవీని ప్లాన్ చేసుకుంటున్నాడు.

అజ‌య్ భూప‌తి: """/"/ కార్తికేయ హీరోగా RX100 సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు అజ‌య్.

డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరికి మంచి మ‌సాలా జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు.

అనంత‌రం శ‌ర్వానంద్- సిద్ధార్థ హీరోలుగా మ‌హా స‌ముద్రం అనే ప్రాజెక్టు ఓకే అయిన‌ట్లు టాక్ వినిపించింది.

అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం ఇంకా రాలేదు.రాహుల్ సంక్రుత్యాన్: """/"/ త‌న తొలి సినిమా ట్యాక్సీవాలా యావ‌రేజ్‌గా ఆడిన‌ప్ప‌టికీ.

ద‌ర్శ‌కుడి ప‌నితనాన్ని అంద‌రూ మెచ్చుకున్నారు.విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న బాగున్నా.

క‌థ కార‌ణంగా జ‌నాల్లోకి అంత‌గా ఎక్క‌లేదు.తాజాగా శ్యామ్ సింగ రాయ అనే సినిమాకు రాహుల్ రెడీ అయ్యాడు.

నానీ హీరోగా ఓ సినిమా చేసేందుకు ఈయ‌న ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.జ‌య శంక‌ర్: """/"/ త‌న తొలి సినిమా పే‌ప‌ర్ బాయ్ తో మంచి ఫీల్ గుడ్ మూవీని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు జ‌య ‌శంక‌ర్.

తాజాగా విటామిన్ షి అనే సినిమా ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కారోనా కార‌ణంగా సినిమా షూటింగ్ కాస్త లేట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?