మొబైల్ ఫోన్లో స్పామ్ కాల్స్ ను ఇలా బ్లాక్ చేసేయండి..!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ( Smart Phone )వినియోగదారులకు స్పామ్ కాల్స్ ( Spam Calls )చాలా ఇబ్బందులు పెట్టడంతో పాటు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

మన మొబైల్ ఫోన్ కు తెలియని వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ సురక్షితమైనవో కాదో తెలియక ఎంతోమంది అమాయకులు ఇబ్బందులు పడుతున్నారు.

వినియోగదారుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని చర్యలు తీసుకుంది.

ఇక ఎటువంటి యాప్ సహాయం లేకుండానే అపరిచిత వ్యక్తుల నెంబర్లను బ్లాక్ చేయవచ్చు.

ఎటువంటి కంపెనీ మొబైల్ ఫోన్ లో అయినా ఈ ఫీచర్ అందుబాటులో వుంటుంది.

కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లలోని కంపెనీని బట్టి ఫీచర్ యొక్క ప్రక్రియ ఆధారపడి వుంటుంది.

ఐఫోన్ వినియోగదారులు కేవలం ఒక క్లిక్ తో స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టెయ్యొచ్చు.

ఐఫోన్: ఐఫోన్ కంపెనీ ఏదైనా విధానం మాత్రం ఒకటే.ముందుగా మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, కిందికి స్క్రోలింగ్ చేయాలి.

అక్కడ మీకు సైలెన్స్ Unknown కలర్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది.క్లిక్ చేస్తే ఫోన్ లో ఉండే Unknown నెంబర్స్ అన్ని తొలగిపోవడమే కాకుండా, స్పామ్ కాల్స్ బ్లాక్ చేయబడతాయి.

"""/" / రియల్ మీ స్మార్ట్ ఫోన్: స్పామ్ కాల్స్ బ్లాక్ చేయడానికి ముందుగా ఫోన్ యాప్ ఓపెన్ చేసి పైన కుడి వైపున కనిపిస్తున్న చుక్కలను క్లిక్ చేయాలి.

అందులో లాక్ అండ్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.నియమాలను సెట్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేసి స్పాం కాల్స్ ను బ్లాక్ చేయవచ్చు.

సియోమి స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ లో ముందుగా ఫోన్ యాప్ లేదా కాలింగ్ యాప్ ఓపెన్ చేసి పై భాగంలో కుడి పక్కన కనిపించే చుక్కలను క్లిక్ చేసి సెట్టింగ్స్ లోపలికి వెళ్లాలి.

అక్కడ స్పాం కాల్స్ బ్లాక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. """/" / శాంసంగ్ స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్లో ముందుగా ఫోన్ యాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి.

బ్లాక్ నెంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.వెంటనే ప్రైవేట్ బ్లాక్ ని ప్రారంభించండి అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయవచ్చు.

వన్ ప్లస్, నోకియా: ఈ రెండు కంపెనీల ఫోన్లలో స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేసే విధానం ఒకేలా ఉంటుంది.

ఫోన్ యాప్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి కాల్స్ ను బ్లాక్ చేయవచ్చు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్…