ఉల్లిపాయ పై నల్లని మచ్చలు.. ఆహార పదార్థాలలో ఉపయోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదమా..

ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉల్లిపాయ లేనిదే ఏ వంట చేయరు.

తాజా ఉల్లిపాయలు ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఇంకా చెప్పాలంటే మార్కెట్లో ఉల్లిపాయలు కొనేటప్పుడు వాటిపై నల్లని మచ్చలు లేదా చారలు కనిపిస్తూ ఉంటాయి.

మనమందరం దాన్ని మురికి అని భావించి కడిగేస్తూ ఉంటాం.ఉల్లిపాయల పై ఉండే ఈ నల్లటి చారలుఆఫ్లటాక్సిన్ అనే ఒక రకమైన విషం.

ఇది శరీరానికి హాని కలిగించే వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి.ఎంతో శుభ్రంగా ఈ నల్లటి చారులను తీసివేస్తే కానీ ఇది ఆహార పదార్థాలలో ఉపయోగించడానికి వీలు కాదు.

ఉల్లిపాయ పై భాగాన్ని అంతా తొలగించడం కూడా ఎంతో మంచిది.ఉల్లిపాయ లోని ఏదైనా పొర దానిని కలిగి ఉంటే ఆ పొరను తీసివేయడం మంచిది.

ఆ తర్వాత అలాగే రెండు మూడు సార్లు కడగడం కూడా మంచిదే.నల్ల ఫంగస్ వ్యాధి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో దాని గురించి అనేక ఫేక్ మెసేజ్లు షేర్ చేయడం మొదలుపెట్టారు.

ఉల్లిపాయ పై నల్లని చారలు లేదా ఫ్రిజ్లోని ఉల్లిపాయలపై నల్లని మచ్చలు బ్లాక్ ఫంగస్ వల్ల వస్తాయని ఎక్కువగా మెసేజ్లను షేర్ చేస్తున్నారు.

ఈ మెసేజ్ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అయింది.కానీ నిజం మాత్రం వేరు ఉల్లిపాయల నల్లని పదార్థాలకు బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధం ఏమీ లేదు.

పర్యావరణంలో సహజంగా సంభవించే మ్యూకోమైసెట్స్ అని పిలువబడే అచ్చుల సమూహం వల్ల బ్లాక్ ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంది.

"""/"/ ఈ ఫంగస్ ప్రధానంగా మధుమోహo మరియు బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అటువంటి వ్యక్తులు సైనస్ లేదా ఊపిరితిత్తులలో ఫంగస్ ప్రవేశించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి నల్ల మచ్చలు కనిపించే ఉల్లిపాయకు నల్ల ఫంగస్ వ్యాధులకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రజలు అర్థం చేసుకోవాలి.

ప్రొడ్యూసర్లు గా మారుతున్న మన స్టార్ డైరెక్టర్ల భార్యలు…