మధుమేహాన్ని తగ్గించే నల్ల ఉప్పు.. మరిన్ని బెనిఫిట్స్ కూడా!
TeluguStop.com
మధుమేహం లేదా చక్కర వ్యాధి.ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల మధుమేహం బారిన పడుతుంటారు.
ఇక మధుమేహం ఉన్న వారు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.కొన్ని ఆహారాలకు దూరంగానూ ఉండాల్సి ఉంటుంది.
అయితే మధుమేహం ఉన్న వారు తెల్ల ఉప్పు, సాల్ట్ కాకుండా నల్ల ఉప్పు తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకంటే, నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.కాబట్టి, మధుమేహం రోగులు నల్ల ఉప్పు తీసుకుంటే మంచిది.
అలాగే నల్ల ఉప్పుతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఈ నల్ల ఉప్పును ఉపయోగిస్తుంటారు.
ఇక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇంట్లో కూడా చాలామంది దీన్ని వాడేందుకు అలవాటు పడుతున్నారు.
"""/" /
ఈ శీతాకాలంలో గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపుతుంది.
మలబద్దకం సమస్య ఉన్న వారికి నల్ల ఉప్పు గ్రేట్‌గా సహాయపడుతుంది.తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును ప్రతి రోజు తీసుకుంటే.
మలమద్ధకం సమస్య దూరం అవుతుంది.గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా నివారిస్తుంది.
అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్న వారు కూడా నల్ల ఉప్పును తీసుకుంటే మంచిది.
ఇక సోడియం చాలా తక్కువగా ఉండే నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిసింది.పోషకాలు మరియు ఖనిజాలతో నిండి ఉండే ఈ నల్ల ఉప్పును తీసుకుంటే.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది.మరియు ఎముకలను దృఢంగా మారుస్తుంది.
పెళ్లి కూతురుగా ముస్తాబయి డాన్స్ ఇరగదీసిన శోభిత.. వీడియో వైరల్!